మా లవ్‌ స్టోరీ మా పిల్లలకు చెబుతా: ప్రియాంక

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అప్పుడే పిల్లల ఊసెత్తుతోంది. నిక్ జోనస్‌తో తన ప్రేమాయణం మొదలు.. తమ పెళ్లి వరకు దారి తీసిన అన్ని విషయాలను పుట్టబోయే తమ పిల్లలకు చెప్తానని అప్పుడే చాటుకుంది. రెండేళ్ల క్రితం మెట్ గాలా వేడుకలో ప్రియాంక, నిక్ జోనస్ కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జరగబోయే మెట్ గాలా కార్యక్రమానికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:20 pm, Mon, 6 May 19
మా లవ్‌ స్టోరీ మా పిల్లలకు చెబుతా: ప్రియాంక

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అప్పుడే పిల్లల ఊసెత్తుతోంది. నిక్ జోనస్‌తో తన ప్రేమాయణం మొదలు.. తమ పెళ్లి వరకు దారి తీసిన అన్ని విషయాలను పుట్టబోయే తమ పిల్లలకు చెప్తానని అప్పుడే చాటుకుంది. రెండేళ్ల క్రితం మెట్ గాలా వేడుకలో ప్రియాంక, నిక్ జోనస్ కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. రెండేళ్ల డేటింగ్ అనంతరం గతేడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జరగబోయే మెట్ గాలా కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ ఇద్దరు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో 2017లో తాను నిక్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రియాంక దానిపై.. ‘‘మా పిల్లలకు వారి తండ్రిని ఎలా కలిశానో అనే కథను తప్పకుండా చెబుతా’’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రియాంక కామెంట్లను చూస్తుంటే పిల్లల కోసం ఆమె సిద్ధమైనట్లు ఉందని కొంతమంది అప్పుడే ఊహాగానాలు మొదలెట్టారు.