మంత్రి మండలికి రాష్ట్రపతి విందు

ఢిల్లీ: మంత్రి మండలి రద్దు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంత్రులందరికీ చివరిసారి విందు ఇచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ దీనికి వేదికైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, సుష్మా స్వరాజ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం విందుకు హాజరుకాలేదు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన దీనికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ […]

మంత్రి మండలికి రాష్ట్రపతి విందు
Follow us

|

Updated on: May 25, 2019 | 8:04 AM

ఢిల్లీ: మంత్రి మండలి రద్దు కానున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంత్రులందరికీ చివరిసారి విందు ఇచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ దీనికి వేదికైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, సుష్మా స్వరాజ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం విందుకు హాజరుకాలేదు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన దీనికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత మంత్రి మండలిని రద్దు చేయాల్సి ఉంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం చివరిసారి సమావేశమైన మంత్రివర్గం, మంత్రి మండలిని రద్దు చేస్తున్నట్లు తీర్మానించింది. దీనికి సంబంధించిన ప్రతిని రాష్ట్రపతికి పంపారు. మరోవైపు మోదీ సైతం తన రాజీనామాను రాష్ట్రపతికి అందించగా ఆయన ఆమోదించారు. రాష్ట్రపతి కోరిక మేరకు మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేవరకూ ప్రధానిగా కొనసాగనున్నారు.