Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ప్రణబ్ ముఖర్జీకి “భారత రత్న”..!

Pranab Mukherjee Honoured With Bharat Ratna Award, ప్రణబ్ ముఖర్జీకి “భారత రత్న”..!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మోదీ, ఎల్ కే అద్వానీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలకు కూడా వారి మరణానంతరం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించారు.

ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో కొనసాగిన ఆయన కేంద్రంలో రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో డిగ్రీలు పొందారు. 1935 డిసెంబరు 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో ఉంటూ దేశానికి సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. 1973లో తొలిసారి ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టారు. పీ వీ నరసింహా రావు ప్రభుత్వంలో 1991లో ప్రణబ్ ముఖర్జీని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు.