నాగబాబు వల్లే చిరు, పవన్‍కు నష్టం

జనసేన పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి.. చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబుపై వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారంలో భాగంగా నాగబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నిరాధారమైన‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంతూరిలో లైబ్రరీ పెట్టుకునేందుకు ప్రజలు చిరంజీవి ఇంటిని అడిగితే ఉమ్మడి ఆస్తుల పేరిట అడ్డుకున్న వ్యక్తి నాగబాబు అని ఆయన విమ‌ర్శించారు. నాగబాబు ఎలాంటి వాడో జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని కృష్ణంరాజు అన్నారు. ఆయన పదవి కోసమే ఎన్నికల్లో పోటీ […]

నాగబాబు వల్లే చిరు, పవన్‍కు నష్టం

Updated on: Mar 27, 2019 | 4:51 PM

జనసేన పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి.. చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబుపై వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారంలో భాగంగా నాగబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నిరాధారమైన‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంతూరిలో లైబ్రరీ పెట్టుకునేందుకు ప్రజలు చిరంజీవి ఇంటిని అడిగితే ఉమ్మడి ఆస్తుల పేరిట అడ్డుకున్న వ్యక్తి నాగబాబు అని ఆయన విమ‌ర్శించారు.

నాగబాబు ఎలాంటి వాడో జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని కృష్ణంరాజు అన్నారు. ఆయన పదవి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే తప్ప ప్రజాసేవ కోసం కాదని విమర్శించారు. నాగబాబు తీరుతో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై ఉన్న గౌరవం కూడా పోతోందని కృష్ణంరాజు పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న నాగబాబు.. వాపును చూసి బలుపు అనుకోవద్దని హితవు పలికారు. ఏప్రిల్ 11న ఎవరి బలమెంతో తెలిసిపోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us