ఖమ్మం జిల్లాలో కొండా రాఘవరెడ్డి పర్యటన.. షర్మిల బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో సమీక్ష

|

Mar 14, 2021 | 9:41 AM

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో ఉన్న వైయస్‌ షర్మిల శిబిరంలో నేడు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత షర్మిల తొలిసారి..

ఖమ్మం జిల్లాలో కొండా రాఘవరెడ్డి పర్యటన.. షర్మిల బహిరంగ సభ ఏర్పాట్లపై కీలక నేతలతో సమీక్ష
Konda Raghava Reddy
Follow us on

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో ఉన్న వైయస్‌ షర్మిల శిబిరంలో నేడు రెండు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత షర్మిల తొలిసారి పులివెందలలో పర్యటిస్తుండగా.. ఆమె కీలక అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు. కొత్త పార్టీ పేరు ఖమ్మం గుమ్మం నుంచే ప్రకటించాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కొండా రాఘవరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఖమ్మం జిల్లాలో వైఎస్‌ షర్మిల భారీ బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ముఖ్య నేతలతో చర్చించేందుకే షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఖమ్మంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 9న బహిరంగ సభ నిర్వహించాలని షర్మిల నిర్ణయించిన నేపథ్యంలో జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఆయన స్థానిక నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం.

బహిరంగ సభకు ముందు ఉమ్మడి జిల్లా నాయకులతో సమావేశం కావాలని షర్మిల నిర్ణయించారు. నగరంలో వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. బహిరంగ సభావేదికపై నుంచి పార్టీకి సంబంధించిన కీలక వివరాలను షర్మిల వెల్లడించే అవకాశాలు ఉండటంతో సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి కొండా రాఘవరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

గతంలొ ఫిబ్రవరి 21న షర్మిల తలపెట్టిన ఖమ్మం యాత్ర వాయిదా పడిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 100 మంది వైసీపీ నేతలు లోటస్‌ పాండ్‌లో షర్మిలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని షర్మిలను వారు కోరారు. అయితే తాను ఖమ్మం వచ్చి సమీక్ష నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు లక్కినేని సుధీర్‌, కొల్లు వెంకటరెడ్డి, రాంబాబురెడ్డి, వెంకట్రామిరెడ్డి, జల్లెపల్లి సైదులు పాల్గొన్నారు.

Read More:

తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్‌.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ​మంత్రి కేటీఆర్

పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి