ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్ షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ప్రారంభమైంది. తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో తెలంగాణలో ఆమె పార్టీని ప్రారంభించబోతున్నట్లు స్పష్టమైపోయింది. లోటస్‌పాండ్‌లో నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల పార్టీ ఏర్పాటుపై సంకేతాలు ఇచ్చారు. ఇక వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు.
లోటస్ పాండ్ లోని కార్యాలయం వద్ద మీడియాతో షర్మిల మాట్లాడారు. తన పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని చెప్పారు. తెలంగాణలో వైసీపీ విభాగంతో కలసి పని చేస్తానని తెలిపారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా తన దారి తనదేనని అన్నారు. తెలంగాణ రాజకీయ అంశాల వరకే తమ పార్టీ పరిమితమవుతుందని ఏపీలో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు.
మరోవైపు వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై వైయస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. షర్మిల ఆదేశాల మేరకు తెలంగాణలో పార్టీ విస్తరణకు పాటు పడతామని చెప్పారు. రాబోవు కాలంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని అన్నారు.
Read more: