ఉత్తమ్‌ టీపీసీసీ పదవి ఉంటుందా..? ఊడుతుందా..?

హుజూర్ నగర్.. ఉప ఎన్నికపోరు ముగిసింది.. ఫలితం తేలిపోయింది.. ఎవరూ ఊహించని విధంగా అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజర్టీని కట్టబెట్టారు. అంతా ఓకే. కానీ ఇదే ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో హస్తం క్యాడర్ ఢీలా పడిపోయారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటీ అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుజూర్ నగర్ ఓటమితో ఆయన టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తారా..లేదా […]

ఉత్తమ్‌ టీపీసీసీ పదవి ఉంటుందా..? ఊడుతుందా..?
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 4:57 AM

హుజూర్ నగర్.. ఉప ఎన్నికపోరు ముగిసింది.. ఫలితం తేలిపోయింది.. ఎవరూ ఊహించని విధంగా అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజర్టీని కట్టబెట్టారు. అంతా ఓకే. కానీ ఇదే ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో హస్తం క్యాడర్ ఢీలా పడిపోయారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటీ అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుజూర్ నగర్ ఓటమితో ఆయన టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తారా..లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధిష్టానం ఆయన్ను ఈ పదవిలో ఇంకా కంటిన్యూ చేస్తుందా లేక.. కొత్త వారిని ఈ స్థానంలోకి దింపుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

టీపీసీసీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారుస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమైంది. టీఆర్ఎస్‌కు ప్రత్నామ్నాయంగా అధికారాన్ని చేపడుతుందనుకున్న వేళ.. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర ఓటమిని చూడాల్సివచ్చింది. ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యమే అంటూ.. పార్టీలోని కొందరు గుసగుసలాడారు. అయితే ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో విషయంలో కూడా విఫలమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకుంటుందనుకున్న వేళ.. గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కి వెళ్లిపోయారు. అయితే ఈ తరుణంలో వారిని అపలేకపోయారు. దీంతో టీపీసీసీగా ఉత్తమ్ వైఫల్యం చెందారంటూ పార్టీ శ్రేణులు కొందరు బహిరంగంగానే విమర్శలు చేశారు.

అయితే ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు అంకెల సీట్లు ఖాయమంటూ ప్రగల్భాలు పలికి.. ఆ తర్వాత చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు మూడింటితోనే సరిపెట్టుకున్నారు. అయితే కనీసం రెండో స్థానంలో సీట్లు సాధించిన సీన్ మరోలా ఉండేది. కానీ ఎవరూ ఊహించని విధంగా బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ.. బీజేపీ నాలుగు సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది. ఇది కాంగ్రెస్‌కు ముఖ్యంగా ఉత్తమ్‌కు మైనస్‌గా మారింది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉంటామనుకున్న తరుణంలో బీజేపీ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టింది.

ఇదంతా ఇలా ఉంటే..  తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు ఆయనకు మరో తలనొప్పిగా మారింది. సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో హస్తం శ్రేణులు ఢీలా పడ్డాయి. ఈ ఫలితం పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందంటూ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న మరో ఎమ్మెల్యే సీటు కూడా అధికార పార్టీకి అప్పగించినట్లైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఉండి.. హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం.. ఆయన ప్రెస్టెజ్ ఇష్యూగా మారింది.

మరి ఈ తరుణంలో ఉత్తమ్ భవిష్యత్ ఏంటి..? ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి..? టీపీసీసీగా కంటిన్యూ అవుతారా..? అధిష్టానం ఆయనవైపు మొగ్గుచూపుతుందా..? లేక ఈ వైఫల్యాలను కారణాలుగా చూపుతూ మరొ నేతకు ఈ పదవి కట్టబెడతారా అన్నది మరికొద్ది రోజులు వేచిచూస్తే తెలుస్తోంది.

Latest Articles
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా