రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానివ్వం : శివసేన

ముంబై : ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తీవ్ర విభేదాలున్న పార్టీలు సైతం అధికార దాహంతో ఏకమయ్యాయని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తరపున నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించామని అన్నారు. మరి ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి […]

రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానివ్వం : శివసేన

Edited By:

Updated on: Apr 08, 2019 | 8:01 PM

ముంబై : ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తీవ్ర విభేదాలున్న పార్టీలు సైతం అధికార దాహంతో ఏకమయ్యాయని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తరపున నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించామని అన్నారు. మరి ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ సవాల్ విసిరారు.

Follow Us