MLC Kavitha: మహిళా జర్నలిస్టుల సమస్యలపై వర్క్‌ షాప్‌.. డిమాండ్ల సాధనతోపాటు సమస్యలపై చర్చ..

|

Apr 24, 2022 | 9:53 PM

దేశంలో ఎంతోమంది టాలెంటెడ్‌ మహిళా జర్నలిస్టులు ఉన్నారన్నారు MLC కవిత. కేవలం వార్త రాయడమే కాదు, దానికి రెస్పాన్స్‌బులిటీ తీసుకునేవాళ్లే నిజమైన జర్నలిస్టులు అన్నారు. మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులుంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు కవిత.

MLC Kavitha: మహిళా జర్నలిస్టుల సమస్యలపై వర్క్‌ షాప్‌.. డిమాండ్ల సాధనతోపాటు సమస్యలపై చర్చ..
Mlc Kavitha
Follow us on

దేశంలో ఎంతోమంది టాలెంటెడ్‌ మహిళా జర్నలిస్టులు ఉన్నారన్నారు ఎంఎల్సీ కవిత( MLC Kavitha). కేవలం వార్త రాయడమే కాదు, దానికి రెస్పాన్స్‌బులిటీ తీసుకునేవాళ్లే నిజమైన జర్నలిస్టులు అన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 250 మంది మహిళా జర్నలిస్టులకు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులుంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు కవిత.  మహిళా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్‌, మీడియా కిట్‌ సాధనే లక్ష్యంగా వర్క్‌షాప్‌ జరిగింది. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో నాలుగు వందల మందికి పైగా మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. డిమాండ్ల సాధనతోపాటు సమస్యలపై చర్చించారు. రెండ్రోజులపాటు జరిగిన మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మహిళా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్‌ ఉండాలన్న ప్రధాన లక్ష్యంతోనే ఈ వర్క్‌షాప్‌ నిర్వహించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ.

ముగింపు సెషన్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మహిళా జర్నలిస్టులు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగాలంటూ సూచించారు. అడ్డంకులుంటాయ్‌, కానీ అధిగమించాలన్నారు. అదే, టైమ్‌ క్రెడిబులిటీ చాలా ముఖ్యమన్నారు. రాసిన వార్తకు బాధ్యత తీసుకునేవాళ్లే నిజమైన జర్నలిస్టులన్నారు కవిత.


నలుగురికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలనే తాను కూడా రాజకీయాల్లో ఇబ్బందులెదురైనా వెనక్కి తగ్గలేదన్నారు కవిత. తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే దక్కుతుందన్నారు. కరోనా పాండమిక్‌ టైమ్‌లో జర్నలిస్టులకు 42కోట్ల రూపాయలను సాయంగా ప్రభుత్వం అందించిందని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..