టీడీపీ ఎంపీ మూడు రాజధానుల లేఖపై మోదీ సమాధానం..!

ఏపీ మూడు రాజధానుల అంశం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారు.

టీడీపీ ఎంపీ మూడు రాజధానుల లేఖపై మోదీ సమాధానం..!

Updated on: Mar 17, 2020 | 7:00 AM

ఏపీ మూడు రాజధానుల అంశం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా టీడీపీ ఎంపీ రాసిన ఈ లేఖకు మోదీ ప్రత్యేకంగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులను ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. రాజకీయంగానూ పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత వాసులు గత 90 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ప్రతిపాదనపై టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు స్పందించిన మోదీ.. పరిశీలిస్తున్నామంటూ చెప్పడం విశేషం.

Loading...
Unable to load recommendations.
Follow Us