
నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖ కమెడియన్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది పేదలను దివంగత వైఎస్సార్ ఆదుకున్నారని, అందుకే తనకు వైఎస్సార్ అంటే ఇష్టమని అలీ చెప్పారు. వైఎస్ కుమారుడు జగన్‌ను మాట ఇస్తే తప్పే వ్యక్తి కాదు, ఏపీకి జగన్ అవసరం ఎంతో ఉందని అలీ అన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, జగన్‌ను గెలిపించి సీఎంగా చేద్దామని అలీ అన్నారు.