తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచగా మరికొందరిని స్టేషన్‌కు తరలించారు. హాలియాలో నిర్వహించే సీఎం సభను అడ్డుకుంటామని బీజేపీ నల్లగొండ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని హాలియాలో కేసీఆర్ సభను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభను అడ్డుకుంటామన్న శ్రీధర్‌రెడ్డిని పెద్దవూర మండలం పులిచర్లలోని తన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బీజేపీ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Read more:
టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా.. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ