స్పీడందుకున్న ఆపరేషన్ కమలం..

తెలంగాణలో ఆపరేషన్‌ కమలం స్పీడందుకుంది. ముందు సైకిల్‌ను దెబ్బతీయాలని ఆ పార్టీ పన్నిన వ్యూహం ఫలితాలనిస్తోంది. అమిత్‌షా, నడ్డా రావడానికంటే ముందే టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేశారు. అంతేకాదు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నామంటూ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. ఏకంగా ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జీలు రాజీనామా చేశారు. సీనియర్‌ నేతలు పాల్వాయి రజనీకుమారి, మాదగోని శ్రీనివాస్‌ […]

స్పీడందుకున్న ఆపరేషన్ కమలం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 15, 2019 | 10:12 AM

తెలంగాణలో ఆపరేషన్‌ కమలం స్పీడందుకుంది. ముందు సైకిల్‌ను దెబ్బతీయాలని ఆ పార్టీ పన్నిన వ్యూహం ఫలితాలనిస్తోంది. అమిత్‌షా, నడ్డా రావడానికంటే ముందే టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేశారు. అంతేకాదు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నామంటూ ప్రకటించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. ఏకంగా ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జీలు రాజీనామా చేశారు. సీనియర్‌ నేతలు పాల్వాయి రజనీకుమారి, మాదగోని శ్రీనివాస్‌ గౌడ్‌, కడారి అంజయ్య, బండ్రు శోభారాణి, సాధినేని శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని, ఉన్న నాయకత్వం కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకే రాజీనామా చేశామన్నారు పాల్వాయి రజనీకుమారి.

ఇక భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా సరైన గుర్తింపు లేదని.. అయినా అలాగే పని చేశామన్నారు. కార్యకర్తల కోసమే ఇప్పుడు పార్టీ మారుతున్నట్లు చెప్పారు. నడ్డా సమక్షంలో ఈ నెల 18న బీజేపీలో చేరతానని ప్రకటించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి సైతం టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు.