‘ అర్ధరాత్రి రహస్యాలు ‘.. ‘ ప్రజాద్రోహ చర్యలు… ‘ కాంగ్రెస్ మండిపాటు

| Edited By: Srinu

Nov 23, 2019 | 1:03 PM

మహారాష్ట్రలో జరిగిన నాటకీయ పరిణామాలపై షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ‘ ఇది ప్రజలిచ్చిన తీర్పునకు ద్రోహం ‘ చేయడమేనని దుయ్యబట్టింది. ఈ సందర్భంగా ‘ ది గాడ్ ఫాదర్ ‘ అనే క్లాసిక్ నుంచి… ‘ మీ మిత్రులను దగ్గరగా ఉంచండి . అలాగే వారిని మరింత చేరువ చేయండి ‘ అనే వాక్యాన్నికాంగ్రెస్ నేత మిలింద్ దేవర ట్వీట్ చేశారు. ముంబైలో జరిగిన ఓవర్ నైట్ ట్విస్ట్ లో.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ […]

 అర్ధరాత్రి రహస్యాలు ..  ప్రజాద్రోహ చర్యలు...  కాంగ్రెస్ మండిపాటు
Follow us on

మహారాష్ట్రలో జరిగిన నాటకీయ పరిణామాలపై షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ‘ ఇది ప్రజలిచ్చిన తీర్పునకు ద్రోహం ‘ చేయడమేనని దుయ్యబట్టింది. ఈ సందర్భంగా ‘ ది గాడ్ ఫాదర్ ‘ అనే క్లాసిక్ నుంచి… ‘ మీ మిత్రులను దగ్గరగా ఉంచండి . అలాగే వారిని మరింత చేరువ చేయండి ‘ అనే వాక్యాన్నికాంగ్రెస్ నేత మిలింద్ దేవర ట్వీట్ చేశారు. ముంబైలో జరిగిన ఓవర్ నైట్ ట్విస్ట్ లో.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ‘ కొత్త అంకానికి తెర లేపారు. ఉదయం ఎనిమిదిగంటలయ్యేసరికి రాజ్ భవన్ లో వీరు ప్రమాణం చేసేశారు. అంతకుముందు శుక్రవారం రాత్రి పది, పదిన్నర గంటల సమయంలో.. కాంగ్రెస్, సేన పార్టీలకు ఎన్సీపీ తన మద్దతును ప్రకటించింది. శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు. ఆ తరువాతే సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే సీఎంగా.. సేన, కాంగ్రెస్, ఎన్సీపీ అలయెన్స్ ను ప్రకటించారు. పైగా ప్రభుత్వం ఏర్పాటుకు శివసేనతో చేతులు కలపడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చ్చారు కూడా. దీంతో ఈ ‘ పొత్తు ‘ అంశం మరింత బలపడింది. కాగా-ఇదంతా చట్ట విరుధ్ధమని, అర్ధరాత్రి సీక్రెట్ గా జరిగిన దుష్ట తతంగమని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సైతం ఖండించారు. ‘ చాటుమాటున ప్రమాణ స్వీకారం చేశారంటే.. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు.. ఈ అనైతిక చర్య దాదాపు స్వయం వినాశనమే ‘ అని ఆయన కూడా ట్వీట్ చేశారు. మరోవైపు-ఈ పరిణామంపై సుప్రీంకోర్టుకెక్కాలని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన యోచిస్తున్నాయి.