భలే మంచి ముహూర్తం : ఎగబడ్డ నేతలు, కర్నూలు జిల్లాలో రెండో రోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల జోరు

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్థానిక నాయకులు నామినేషన్లు జోరుగా వేస్తున్నారు. నామినేషన్లకు..

భలే మంచి ముహూర్తం : ఎగబడ్డ నేతలు, కర్నూలు జిల్లాలో రెండో రోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల జోరు

Updated on: Jan 30, 2021 | 8:44 PM

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్థానిక నాయకులు నామినేషన్లు జోరుగా వేస్తున్నారు. నామినేషన్లకు రెండోరోజు శనివారం మంచి రోజు కావడంతో నామినేషన్ల దాఖలు జోరుగా సాగింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధి, వెలుగోడు ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలు చేశారు. ఇంకా రెండు రోజుల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

మొదటి రోజు నామినేషన్లు మందకొడిగా సాగినా రెండో రోజు మంచి ముహూర్తం అవడంతో నామినేషన్లు పల్లెల్లో భారీగా వేశారు. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం గ్రామాల్లో నెలకొంది. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. గ్రామ సచివాలయాలకు 100 మీటర్ల దూరంలోనే ప్రజలను ఆపి కేవలం అభ్యర్థులను మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతి ఇస్తున్నారు పోలీసులు.