రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్.. కలవరపడుతున్న దక్షిణాది నేతలు

| Edited By:

Mar 10, 2019 | 5:08 PM

లోక్ సభతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూలును సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. అయితే షెడ్యూల్ విడుదలైన సమయం గురించి దక్షిణాది నేతలు టెన్షన్ పడుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణం. మన దక్షిణాది నేతలు వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని ఎంతో నమ్మకంగా పాటిస్తారనే సంగతి తెలిసిందే. శాసనసభను రద్దు చేయడానికి, ఎన్నికల ప్రచారానికి, […]

రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్.. కలవరపడుతున్న దక్షిణాది నేతలు
Follow us on

లోక్ సభతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూలును సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. అయితే షెడ్యూల్ విడుదలైన సమయం గురించి దక్షిణాది నేతలు టెన్షన్ పడుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణం. మన దక్షిణాది నేతలు వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని ఎంతో నమ్మకంగా పాటిస్తారనే సంగతి తెలిసిందే. శాసనసభను రద్దు చేయడానికి, ఎన్నికల ప్రచారానికి, రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి, మంత్రి మండలి విస్తరణకు ఇలా అన్ని అంశాల్లో కేసీఆర్ గ్రహబలాల ఆధారంగానే ముందడుగు వేశారు. దేవెగౌడ, చంద్రబాబు నాయుడు, యడ్యూరప్పలకు కూడా వీటిపై నమ్మకం చాలా ఎక్కువే. ఈ నేపథ్యంలో, రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో.. నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.