మాజీ మంత్రి యనమల సోదరుడిపై కేసు నమోదు

తూర్పు గోదావరి జిల్లా తునిలో అన్న క్యాంటీన్‌ అద్దాలు పగిలిన సంఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుతో పాటు మరో ముగ్గురు నాయకులపై కేసు నమోదయింది. నిన్న ఉదయం తునిలోని అన్న క్యాంటీన్‌ దగ్గర కృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం అన్న క్యాంటీన్‌పై కొందరు దుండగులు రాళ్ళు రువ్వారు. దీంతో క్యాంటీన్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. తుని మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:35 pm, Sat, 17 August 19
మాజీ మంత్రి యనమల సోదరుడిపై కేసు నమోదు

తూర్పు గోదావరి జిల్లా తునిలో అన్న క్యాంటీన్‌ అద్దాలు పగిలిన సంఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుతో పాటు మరో ముగ్గురు నాయకులపై కేసు నమోదయింది. నిన్న ఉదయం తునిలోని అన్న క్యాంటీన్‌ దగ్గర కృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం అన్న క్యాంటీన్‌పై కొందరు దుండగులు రాళ్ళు రువ్వారు. దీంతో క్యాంటీన్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. తుని మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.