పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్..ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. దూరదృష్టి గానీ, ఒక అవగాహన గానీ లేని ఈ ప్రధాని వీటిని కప్పిపుచ్చుకునేందుకు కోవిడ్ సంక్షోభాన్ని అంచనా వేయలేకపోయారని, దీన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించిన అనంతరం స్పందించిన కిషోర్.. ఈ పాండమిక్ పై జరిపే పోరులో తనదే విజయమని చెప్పుకుంటూప్రధాని ప్రజలను బ్లఫ్ చేశారని అన్నారు. ఈ క్రైసిస్ ని మోదీ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేసిందో చూడండని అంటూ ఆయన తన ట్వీట్లలో నాలుగు అంశాలను ప్రస్తావించారు. దూరదృష్టి, అవగాహన లేనప్పుడు వీటిని కప్పిపుచ్చుకోవడానికి సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, అంతలోనే పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకుంటున్నట్టుగా తనదే విజయమని చాటుకోవడానికి ఈ సమస్యను ఇతరుల వైపు నెట్టివేయడం, పరిస్థితి మెరుగు పడగానే తనదే ఘనత అని చెప్పుకోవడానికి భక్తులైన తన సైన్యంతో ముందుకు రావడం అని ప్రశాంత్ కిషోర్ దుయ్యబట్టారు.
ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రానికి అత్యవసరంగా 5.4 కోట్ల డోసుల వ్యాక్సిన్ కావాలనికేంద్రాన్ని కోరుతూనే… గతంలో 80 దేశాలకు వ్యాక్సిన్ పంపిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సంక్షోభానికి ముందు చూపు కొరవడడమే కారణమని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారని, పలు రాష్ట్రాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ కేసులు పెరిగిపోయినందున కోల్ కతా నగరంలో తాను ప్రచారం చేయబోనని మమత ప్రకటించిన సంగతి విదితమే.
మరిన్ని ఇక్కడ చూడండి: Hen dead Suddenly: పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ… నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు