అభిమాని అత్యుత్సాహంతో కిందపడ్డ పవన్

అభిమాని అత్యుత్సాహం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కిందపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న పవన్ కల్యాణ్ తాజాగా విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పవన్ ఒక్కసారిగా తుళ్లిపడి కింద పడిపోయారు. ఈ ఘటనలో మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది పవన్‌ను పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని […]

అభిమాని అత్యుత్సాహంతో కిందపడ్డ పవన్

Updated on: Apr 05, 2019 | 5:08 PM

అభిమాని అత్యుత్సాహం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కిందపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న పవన్ కల్యాణ్ తాజాగా విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పవన్ ఒక్కసారిగా తుళ్లిపడి కింద పడిపోయారు. ఈ ఘటనలో మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది పవన్‌ను పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Follow Us