ప్రత్యేక జిల్లాగా నంద్యాల: చంద్రబాబు

నంద్యాల: ఎన్నికల తర్వాత నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కర్నూల్ జిల్లా నంద్యాలలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడమే కాకుండా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. మోడీ మరోసారి ప్రధాని అయితే ముస్లింలను బతకనివ్వరని, గోద్రా అల్లర్లలో ముస్లింల ఊచకోత జరిగిందని అన్నారు. దుల్హన్ పథక సాయాన్ని రూ. […]

ప్రత్యేక జిల్లాగా నంద్యాల: చంద్రబాబు

Edited By:

Updated on: Mar 27, 2019 | 4:37 PM

నంద్యాల: ఎన్నికల తర్వాత నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కర్నూల్ జిల్లా నంద్యాలలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడమే కాకుండా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.

మోడీ మరోసారి ప్రధాని అయితే ముస్లింలను బతకనివ్వరని, గోద్రా అల్లర్లలో ముస్లింల ఊచకోత జరిగిందని అన్నారు. దుల్హన్ పథక సాయాన్ని రూ. లక్షకు పెంచుతామని, ఇమామ్, మౌజమ్‌ల వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు.