విశాఖ ఉక్కు కన్నా.. సుజనా స్టీల్స్‌పైనే ఆయనకు ప్రేమ.. బ్యాంకులను దివాలా తీయించిన ఘనత వారికే దక్కుతుందన్న వైసీపీ ఎంపీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే సమయంలో..

విశాఖ ఉక్కు కన్నా.. సుజనా స్టీల్స్‌పైనే ఆయనకు ప్రేమ.. బ్యాంకులను దివాలా తీయించిన ఘనత వారికే దక్కుతుందన్న వైసీపీ ఎంపీ
Vijayasai reddy

Updated on: Feb 09, 2021 | 4:17 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని, ఆయనకు విశాఖ స్టీల్స్‌ తెలీదు కానీ సుజనా స్టీల్స్‌ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.

బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనాచౌదరి అని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని ఇప్పటికే సీఎం జగన్‌ ప్రధానికి లేఖ రాశారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వద్దని నిర్మలాసీతారామన్‌ను కలిశామని,నష్టాలుంటే గట్టెక్కించాలని సూచించామని తెలిపారు.

చంద్రబాబు 56 సంస్థలను అమ్మేశారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం చంద్రబాబు పోరాడతాననడం హాస్యాస్పదం. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో చంద్రబాబు నటిస్తున్నారు. వాజ్‌పేయ్ హయాంలో వ్యతిరేకించా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశంలో బ్యాంకులను దివాళా తీయించిన వ్యక్తుల్లో చంద్రబాబు మనుషులు చాలా మంది ఉన్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

Read more:

ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. వాదోపవాదాల అనంతరం విచారణ ఈ నెల 17కు వాయిదా

Loading...
Unable to load recommendations.
Follow Us