పోడు రైతులకు అన్యాయం జరగనివ్వం.. పోడు భూములపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారన్న సత్యవతి రాథోడ్‌

|

Jan 31, 2021 | 5:05 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోనీ ఇల్లందు, కామేపల్లి మండలాల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇల్లందు..

పోడు రైతులకు అన్యాయం జరగనివ్వం.. పోడు భూములపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారన్న సత్యవతి రాథోడ్‌
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోనీ ఇల్లందు, కామేపల్లి మండలాల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత పర్యటించారు. ఇల్లందులో ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పసుపు, కారం తయారీ మిషన్ ను ప్రారంభించారు.

అనంతరం కామేపల్లి మండలంలో 40 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన మునగాకు ప్రాసెస్ యూనిట్‌ను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యపై న్యూ డెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు మంత్రి సత్యవతి రాథోడ్ కు మెమోరాండం సమర్పించారు.

పోడు రైతుల విషయంలో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. పోడు రైతులను తప్పకుండా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఐ టి డి ఎ పి ఓ. జిల్లా అధికారులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.