Ambati Rambabu: ఆయనకు స్కీన్‌ప్లే రాయడం వస్తే.. తమకు దత్తపుత్రుడు సినిమా తీయడం వచ్చు..

|

Apr 24, 2022 | 9:36 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌కు రాజకీయ పట్టుదల లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎం చేసేందుకు పవన్‌ ఆరాటపడుతున్నారని అన్నారు. పవన్‌కు స్కీన్‌ప్లే రాయడం వస్తే..

Ambati Rambabu: ఆయనకు స్కీన్‌ప్లే రాయడం వస్తే.. తమకు దత్తపుత్రుడు సినిమా తీయడం వచ్చు..
Ambati Rambabu On Janasena
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌కు రాజకీయ పట్టుదల లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎం చేసేందుకు పవన్‌ ఆరాటపడుతున్నారని అన్నారు. పవన్‌కు స్కీన్‌ప్లే రాయడం వస్తే.. తమకు దత్తపుత్రుడు పేరుతో సినిమా కూడా తీయడం వచ్చని సెటైర్‌ వేశారు.  కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు పవన్‌ను గాలంగా వేశారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సెటైర్లు వేసే హక్కు పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు వేసి మాట్లాడొచ్చు కాని.. తాము మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌కు సొంత ఆలోచన లేదని విమర్శించారు. కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు పవన్‌ను గాలంగా వేశారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో సీపీఎస్‌పై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. చింతలపూడిలో వైసీపీ, జగన్‌ను విమర్శించారని తెలిపారు.

తనపై సెటైర్‌ వేయవద్దన్న పవన్‌ తమపై ఎలా వేశారంటూ ప్రశ్నించారు. ఆయన సెటైర్‌ వేయవచ్చు కానీ తాము వేయకూడదా అని పవన్‌ను అడిగారు. పవన్ స్క్రీన్ ప్లే రాస్తే తాము సినిమా కూడా తీస్తామన్నారు మంత్రి అంబటి రాంబాబు. దత్తపుత్రుడు సినిమా తీస్తామంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు కాకాపోతే పవన్ ఎందుకు చాకిరి చేస్తున్నారన్నారు.

చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని వైసీపీ నేతలను విమర్శిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీని గద్దె దించడం చంద్రబాబు వల్ల కూడా కాదన్నారు. పవన్ కల్యాణ్‌, రఘురామకృష్ణం రాజు డైరెక్షన్‌లో చంద్రబాబు ధన సాయంతో వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..