‘చలో వారణాసి’..మోదీపై పోటీకి సై అన్న తెలంగాణ రైతులు

హైదరాబాద్‌: నిజాబామాద్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా 184 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో.. దేశంలోనే తొలిసారి ఎం3 రకం ఈవీఎంలను ఇక్కడ వినియోగించారు.  తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ […]

‘చలో వారణాసి’..మోదీపై పోటీకి సై అన్న తెలంగాణ రైతులు

Updated on: Apr 23, 2019 | 4:34 PM

హైదరాబాద్‌: నిజాబామాద్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా 184 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో.. దేశంలోనే తొలిసారి ఎం3 రకం ఈవీఎంలను ఇక్కడ వినియోగించారు.  తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర  అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు.  తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తయ్యే పసుపులో భారత్ వాటా 80శాతం ఉంది. ఇక దేశంలో పండించే పసుపులో తెలంగాణ వాటా 13శాతం ఉంటుంది. అందులోనూ నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పసుపును పండిస్తారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర రూ.4,500 పలుకుతోంది. పసుపు పంటపై లక్షలకు లక్షలు పెట్టుబడి పెడుతున్నామని..ఈ ధర తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రాక..అప్పుల పాలవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్వింటాల్‌కు రూ. 10,000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.