
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తామని జనసేన, బీఎస్పీ పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన, బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు సూటి ప్రశ్న వేశారు. మాయావతి పార్టీతో జత కట్టి పోటీ చేస్తానంటున్న పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తారా? అని అడిగారు.
దీనికి పవన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పవన్, మాయావతి సమాధానం చెప్పాలని అన్నారు. అంతకుముందు రోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. దండం పెట్టి అడుగుతున్నాను ఏపీని కేసీఆర్ వదిలిపెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.