ఆంధ్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి

హైదరాబాద్: కేసీఆర్, జగన్, మోడీ కలిపి నా మీద దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కవిత స్పందించారు. తాను ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదని, అది చంద్రబాబుకు ప్లస్ అవుతుందని చెప్పారు. తాము ఏదైనా మాట్లాడితే దాని నుంచి లబ్ధి పొందాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని కవిత విమర్శించారు. అయితే తాను ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తానని.. ఇతర రాష్ట్రాల అంశాలను పక్కన పెట్టి, ఏపీని అభివృద్ధి చేయడానికి ఎవరు […]

ఆంధ్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి

Edited By:

Updated on: Mar 27, 2019 | 4:35 PM

హైదరాబాద్: కేసీఆర్, జగన్, మోడీ కలిపి నా మీద దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కవిత స్పందించారు. తాను ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదని, అది చంద్రబాబుకు ప్లస్ అవుతుందని చెప్పారు. తాము ఏదైనా మాట్లాడితే దాని నుంచి లబ్ధి పొందాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని కవిత విమర్శించారు.

అయితే తాను ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తానని.. ఇతర రాష్ట్రాల అంశాలను పక్కన పెట్టి, ఏపీని అభివృద్ధి చేయడానికి ఎవరు సరైన వ్యక్తో వారినే ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని, వారి కాళ్లలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన నాయకుడు తమ నాయకుడని కవిత చెప్పారు.ప్రజలు రాజకీయ నాయకులకన్నా చాలా తెలివైనవారని, వంద అంశాలను గమనిస్తూ ఉంటారని కవిత అన్నారు.

Follow Us