రాయదుర్గం ఎన్నికపై మంత్రి కాల్వ ధీమా!

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడంతో ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీకే ఓటు వేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా రాయదుర్గంలో ఎన్నిక ఏకపక్షం కానుందని మంత్రి కాల్వ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరాన్ని […]

రాయదుర్గం ఎన్నికపై మంత్రి కాల్వ ధీమా!

Updated on: Apr 05, 2019 | 4:34 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడంతో ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీకే ఓటు వేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా రాయదుర్గంలో ఎన్నిక ఏకపక్షం కానుందని మంత్రి కాల్వ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరాన్ని అందరూ గుర్తించారన్నారు. తెలుగుదేశానికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాలనే యోచనలో ప్రజలున్నారని…ఇదో సానుకూలమైన వాతావరణమని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us