చంద్రబాబు పరాభవానికి వాస్తు లోపమే కారణమా..?

|

Jun 07, 2019 | 12:06 PM

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లే కారణమని వాస్తు పురుష ప్రసాద్ తెలిపారు. బాబు సీఎం అయ్యాక.. అక్కడ వాస్తును పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని.. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మంత్రులు కూడా ఓటమి పాలవడానికి బాబు నివాసానికి వాస్తు లోపించడమే కారణమన్నారు. బాబు కరకట్ట నివాసాన్ని వదిలి పెడితేనే బాగుపడతారని లేకపోతే కుటుంబంలోనూ వైషమ్యాలు తప్పవన్నారు. జగన్ ఇంటికి వాస్తును అందించిన ఆయన.. ఉండవల్లిలో కరకట్ట మీద బాబు నివాసానికి రెండు […]

చంద్రబాబు పరాభవానికి వాస్తు లోపమే కారణమా..?
Follow us on

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లే కారణమని వాస్తు పురుష ప్రసాద్ తెలిపారు. బాబు సీఎం అయ్యాక.. అక్కడ వాస్తును పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని.. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మంత్రులు కూడా ఓటమి పాలవడానికి బాబు నివాసానికి వాస్తు లోపించడమే కారణమన్నారు. బాబు కరకట్ట నివాసాన్ని వదిలి పెడితేనే బాగుపడతారని లేకపోతే కుటుంబంలోనూ వైషమ్యాలు తప్పవన్నారు. జగన్ ఇంటికి వాస్తును అందించిన ఆయన.. ఉండవల్లిలో కరకట్ట మీద బాబు నివాసానికి రెండు వైపులా నుంచి రోడ్లను ఏర్పాటు చేశారని చెప్పారు. లింగమనేని నిర్మించిన చంద్రబాబు ఇంటికి శల్య స్థితిని ఆచరించలేదన్నారు. లోకేష్ ఓటమికి కూడా ఆ ఇల్లే కారణమని వాస్తు పరుష ప్రసాద్ తెలిపారు. గుంటూరు వైపు వెళ్తేనే బాబుకు క్షేమమని చెప్పారు. పైగా అసెంబ్లీ భవనం కూడా వాస్తు ప్రకారం లేదన్నారు. టీడీపీ ఓటమికి బాబు ఇంటికి వాస్తు లేకపోవడం, అసెంబ్లీకి వాస్తు లేకపోవడం ప్రధాన కారణాలన్నారు.

అయితే అసెంబ్లీలో వాస్తు దోషాలను సరి చేయకపోతే.. సీఎం జగన్‌కు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. జగన్ ఇంటికి చక్కని వాస్తు ఉందన్న ఆయన.. అసెంబ్లీ వాస్తును కూడా సరి చేయాలని చెప్పారు. కాజాలో పవన్ ఇంటికి కూడా వాస్తు బాగోలేదన్నారాయన. మద్రాస్ కాలువ వల్ల కాజాలో ఉండే వారెవరూ రాజకీయంగా రాణించలేరని తెలిపారు. విజయవాడలో రాజకీయంగా ఎవరు ఎదగలేరన్న ఆయన.. ఆటోమొబైల్, ఐరన్ ఇండస్ట్రీకి మాత్రమే అనుకూలమని చెప్పారు. అయితే గుంటూరులో రాజకీయంగా ఎదుగుల ఉంది కాని బెజవాడలో ఉండదన్నారు.