ఐపీఎస్‌లపై వేటు: ఇదంతా బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల కుట్ర

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 4:40 PM

ఐపీఎస్‌లపై బదిలీ వేటు వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ పన్నిన కుట్రలో భాగమని టీడీపీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రావు అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా కేవలం వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు ప్రాణముప్పు ఉన్నందు వలనే ఆయనకు జడ్ ప్లస్ సెక్యురిటీని కేటాయించారని.. ఆయన భద్రతను ఇంటలిజెన్స్ డీజీ […]

ఐపీఎస్‌లపై వేటు: ఇదంతా బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల కుట్ర
Follow us on

ఐపీఎస్‌లపై బదిలీ వేటు వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ పన్నిన కుట్రలో భాగమని టీడీపీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రావు అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా కేవలం వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు ప్రాణముప్పు ఉన్నందు వలనే ఆయనకు జడ్ ప్లస్ సెక్యురిటీని కేటాయించారని.. ఆయన భద్రతను ఇంటలిజెన్స్ డీజీ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఇప్పుడు ప్రచార సమయంలో డీజీపై వేటు పడటం సమంజసం కాదని రామ్మోహన్ రావు పేర్కొన్నారు.

కనీసం వారి బదిలీకి కారణం కూడా చెప్పకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం న్యాయవిరుద్ధమని ఆయన అన్నారు. ఇక మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో కడప ఎస్పీపై బదిలీ వేటు వేయడం కూడా కుట్ర చర్యల్లో భాగమేనని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. వివేకాను వైఎస్ కుటుంబ సభ్యులే హత్య చేశారని.. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు కేసును దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఇన్ని రోజులు ఒక నమ్మకం ఉండేదని.. తాజా తీరుతో ఆ నమ్మకం కూడా లేకుండా పోయిందని రామ్మోహన్ రావు అన్నారు. బీజేపీ ఆ పార్టీ సన్నిహిత పార్టీలకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని రామ్మోహన్ రావు ఆరోపించారు.