ఆయన నా వీరాభిమాని.. అప్పట్లో…: జగన్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

| Edited By:

Jun 07, 2020 | 7:51 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి గురించి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.

ఆయన నా వీరాభిమాని.. అప్పట్లో...: జగన్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి గురించి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను అభిమానుల కోసం షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ తనకు వీరాభిమాని అని.. ఒకప్పుడు కడప అభిమాన సంఘం టౌన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారని చెప్పుకొచ్చారు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు.

”మా నాన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్‌లో ఆయనకు చాలా మంది అభిమానులు ఉండేవారు. ఆ పార్టీలోని 90 శాతం నాన్నకు అభిమానులే” అని అన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడుతూ.. ”కేసీఆర్‌ మా నాన్నకి పెద్ద అభిమాని. అంతేకాదు నాన్నకి అత్యంత ఇష్టమైన ఫాలోవర్లలో ఆయన ఒకరు. కేసీఆర్‌ రాజకీయాల్లో వెలుగుతారని నాన్న అప్పట్లోనే అన్నారు. జన్మభూమి ప్రోగ్రామ్ వెనకున్న వారిలో కేసీఆర్ ఒకరు. ఆ ప్రోగ్రామ్‌కి కేసీఆర్‌నే జన్మభూమి అనే పేరును సూచించారు” అని వెల్లడించారు. ఇదిలా ఉంటే 2000 సంవత్సరంలో ‘సమరసింహారెడ్డి’ పోస్టర్‌తో జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ పేపర్ ప్రకటన వచ్చింది. దానికి సంబంధించిన ఫొటో ఒకానొక సమయంలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.  కాగా ఈ నెల 10న బాలయ్య 60వ పుట్టినరోజు జరగనుండగా.. అందుకోసం ఫ్యాన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని వారు రెడీ అవుతున్నారు.

Read This Story Also: ఆ హీరోయిన్ పెళ్లి అయినప్పుడు చాలా బాధపడ్డా: బన్నీ