రక్తపు మడుగులో వివేకా.. మృతిపై అనుమానాలు

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తతో కుటుంబంతో పాటు పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. వివేకానంద రెడ్డి మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని, ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న […]

రక్తపు మడుగులో వివేకా.. మృతిపై అనుమానాలు

Edited By:

Updated on: Mar 15, 2019 | 10:54 AM

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తతో కుటుంబంతో పాటు పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.

వివేకానంద రెడ్డి మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని, ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని, ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం రిపోర్టల కోసం ఎదురుచూస్తున్నారు.