Khammam Ticket: గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాక రేపుతోంది ఖమ్మం టికెట్.. రంగంలో ట్రబుల్ షూటర్ డీకే

ప్రధానపార్టీలన్నీ కన్నేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ఒకే ఒక్క పార్లమెంటు సీటు... పొలిటికల్‌గా పొగలు రాజేస్తోంది. మిగతా పదహారూ ఒక లెక్క..ఆ ఒక్కసీటూ మరో లెక్క అన్నట్లుగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాక రేపుతోంది ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

Khammam Ticket: గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాక రేపుతోంది ఖమ్మం టికెట్.. రంగంలో ట్రబుల్ షూటర్ డీకే
Dk Shivakumar
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:39 PM

ప్రధానపార్టీలన్నీ కన్నేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ఒకే ఒక్క పార్లమెంటు సీటు… పొలిటికల్‌గా పొగలు రాజేస్తోంది. మిగతా పదహారూ ఒక లెక్క..ఆ ఒక్కసీటూ మరో లెక్క అన్నట్లుగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాక రేపుతోంది ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీని కారణం ఆ ముగ్గురు మంత్రులేనట.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటిగా నిలబడి పార్టీని గెలిపించిన ఆ ముగ్గురే.. లోక్‌సభ ఎన్నికల్లో పంతాలకు పోతున్నారట. ఈ ఎపిసోడ్‌లోకి కర్ణాటక ఢిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

ఫైర్‌బ్రాండ్‌ ఉండగా ఆ సీటు వైపు చూసే సాహసం కూడా ఎవరూ చేయరనుకున్నారు. కానీ అధికారపార్టీలో ముఖ్యనేతలంతా టికెట్‌ ప్లీజ్‌ అంటూ క్యూ కడుతున్నారు. ముగ్గురు మంత్రుల కుటుంబాలనుంచి టికెట్లకోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. లోకల్‌గానే పొజిషన్‌ టైట్‌గా ఉంటే.. వేరే ప్రాంతాల సీనియర్లకు కూడా ఆ సీటే హాట్‌కేకులా కనిపిస్తోంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలను గెలుచుకున్న ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా అవతరించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలకు 10 మంది ఉన్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో గెలుపెవరిది అంటే అక్కడి ఫలితాలు, ఓటరు రాజకీయ చైతన్యం కాస్తా విశ్లేషకులను ఆలోచింపచేస్తోంది. ఇందిరాగాంధీ గాలి వీచినా.. ఎన్టీఆర్ హవా కొనసాగినా.. బీఆర్ఎస్ దూసుకెళ్లినా.. ఇందుకు భిన్నంగా తీర్పు ఇస్తున్నారు జిల్లా ఖమ్మం ఓటర్లు.

రాష్ట్రమంతా ఓ గాలి వీచినా.. ఆ జిల్లా మాత్రం నేను సెపరేటు అంటోంది. హేమాహేమీలు తమ లెజెండరీ హవాలో రాష్ట్రం మొత్తం ఊడ్చేసినా తాను మాత్రం ఎవరికి అర్థం కాను అంటోంది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఆ జిల్లా రూటే సెపరేటు. అక్కడి ఓటర్ల నాడి పట్టడం రాజకీయ పార్టీలకు విషమ పరీక్షే. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా వచ్చిన ఫలితాలు గమనిస్తే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అన్ని పార్లమెంట్‌ సెగ్మెంట్‌లు వేరు.. ఆ సెగ్మెంట్ వేరు. ఈసారి ఓటరు అక్కడ ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది.

సహజంగానే ఖమ్మం లోక్‌సభ సీటును గెలవడం కాంగ్రెస్‌కు కేక్‌వాక్ అయితే సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. నామినేషన్ల సమర్పణకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నా.. భారీ పోటీ కారణంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోటీ నెలకొంది.

శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుతుండగా, విక్రమార్క తన భార్య మల్లు నందిని కోసం లాబీయింగ్ చేస్తున్నారు. మరో మంత్రి తమ్ముల నాగేశ్వరరావు కూడా ఇదే స్థానం నుంచి తన కుమారుడుని పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు ఉమ్మడి ఖమ్మం జిల్లా వారే కావడం విశేషం. ముగ్గురిలో ఎవరినైనా ఎంపిక చేయడంలో హైకమాండ్ ఇరుకున పడింది. సమస్యను నిర్ణయించుకోలేక కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని దాని ట్రబుల్ షూటర్, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అప్పగించిందట. ఈ అంశంపై చర్చించేందుకు ఆయన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరినీ బెంగళూరుకు పిలిపించారు. ఈ మేరకు మంగళవారంలోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అయితే బెంగళూరు నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఇరిద్దరినీ కాదని పార్టీ మూడవ అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానానికి మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు ఆర్ రఘురామి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దాంతో పాటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తదితర పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరీ కేక్‌వాక్ లాంటి ఖమ్మం స్థానంలో కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..