ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

| Edited By:

Apr 17, 2019 | 7:48 PM

రాజ్యాంగ వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్న వారికి మోదీ కాపలాకాశారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు దేశానికి కాపలాదారుడినని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇవన్నీ మోదీ ఘోర వైఫల్యాలుగా పేర్కొన్నారు. 2 వేల నోటు తెచ్చిన మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. “వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. […]

ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Follow us on

రాజ్యాంగ వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్న వారికి మోదీ కాపలాకాశారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు దేశానికి కాపలాదారుడినని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇవన్నీ మోదీ ఘోర వైఫల్యాలుగా పేర్కొన్నారు. 2 వేల నోటు తెచ్చిన మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

“వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. అలంకారం కోసమా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలపై ఏకపక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్‌ ఉందా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ అయితే అలా జరిగి ఉండేదా అని అన్నారు. ‘మీ స్వార్థం కోసం దేశాన్ని తగులబెడతారా?’ అంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని తాము ఏమైనా చేస్తాం అన్నట్లుగా అహంకారంతో వ్యవహరిస్తున్న వారిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మేధావులు, విద్యార్థులు స్పందించాలన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.