విజయనగరం: విజయనగరం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవడానికి బందిపోట్లు వస్తున్నారు జాగ్రత్త అని అన్నారు.
వైసీపీ కోడి కత్తి పార్టీ, ఎవురు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టికెట్లు ఇచ్చింది ఆ పార్టీ. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు. మాకు డబ్బులు కాదు సవ ముఖ్యం. సేవకు మారుపేరు టీడీపీ. మనం మళ్లీ గెలవాలి. లేదంటే రాష్ట్రంపై బందిపోట్లు దాడి చేస్తారని చంద్రబాబు చెప్పారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఎలాంటి శక్తీ ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొచ్చాయి. నెత్తిన అప్పుతో అమరావతికి వచ్చాం. ఎవరి జేబులు కొట్టాలి, ఎవరిని దోపిడీ చేయాలన్నదే వైసీపీ లక్ష్యం అని చంద్రబాబు మండిపడ్డారు.
వైఎస్ వివేకా హత్య సాక్ష్యాలను లేకుండా చేయడం ఇంటి దొంగల పనే. కోడికత్తి కేసులో మన పోలీసులు చెప్పిందే ఎన్‌ఐఏ చెప్పింది. నా దగ్గర పని చేసిన కేసీఆర్ నాపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. ముగ్గురు మోడీలు కలిసి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.