నంద్యాల కేంద్రంగా చంద్రబాబు హామీలు

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరిగిన ప్రచార సభలో బాబు పాల్గొన్నారు. టీడీపీని మళ్లీ గెలిపిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని, త్వరలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు సైతం రాబోతున్నాయని ప్రకటించారు. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొస్తాన‌ని, యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు విశ్రమించనని చంద్రబాబు ప్రకటించారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేశామని, […]

నంద్యాల కేంద్రంగా చంద్రబాబు హామీలు

Updated on: Mar 26, 2019 | 7:54 PM

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జరిగిన ప్రచార సభలో బాబు పాల్గొన్నారు. టీడీపీని మళ్లీ గెలిపిస్తే ప్రపంచం మొత్తాన్ని ఏపీకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని, త్వరలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు సైతం రాబోతున్నాయని ప్రకటించారు. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొస్తాన‌ని, యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు విశ్రమించనని చంద్రబాబు ప్రకటించారు.

జగన్‌కు ఓటేస్తే మోదీకి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేశామని, అయినా సరే రాష్ట్రాన్ని పసిపాపలా కాపాడుకుంటూ వచ్చానని వివరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన తీరును మరిచిపోనని, నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని బాబు స్పష్టం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన మోదీని ఇంటికి పంపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us