పార్టీలకు తలనొప్పిగా మారిన అభ్యర్ధుల ప్రకటన

విజయవాడ: ఏపీలో సీట్ల ప్రకటన పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది. సీటు దక్కని వాళ్లు తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ విషయంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో అభ్యర్దుల ప్రకటన చేసేందుకు టీడీపీ సిద్ధమయ్యింది. 16వ తేదీన జగన్ ఇడుపులపాయలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. అయితే ఈ లోపల తమకు సీటు రాదేమోననే ఆలోచనలతో పలువురు నేతలు అసమ్మతి […]

పార్టీలకు తలనొప్పిగా మారిన అభ్యర్ధుల ప్రకటన

Updated on: Mar 14, 2019 | 4:20 PM

విజయవాడ: ఏపీలో సీట్ల ప్రకటన పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది. సీటు దక్కని వాళ్లు తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు. పార్టీ మారేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ విషయంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో అభ్యర్దుల ప్రకటన చేసేందుకు టీడీపీ సిద్ధమయ్యింది.

16వ తేదీన జగన్ ఇడుపులపాయలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. అయితే ఈ లోపల తమకు సీటు రాదేమోననే ఆలోచనలతో పలువురు నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. దీంతో అసమ్మతి నేతలకు పక్క జిల్లాలో సీట్లు కేటాయించేందుకు అధినేతలు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గంట గంటకూ పరిణామాలు మారుతున్నాయి.

Follow Us