శారదాపీఠాన్ని సందర్శించిన సీఎం జగన్‌.. వార్షిక మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్‌ జగన్..

శారదాపీఠాన్ని సందర్శించిన సీఎం జగన్‌.. వార్షిక మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఏపీ సీఎం

Updated on: Feb 17, 2021 | 12:32 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్‌ జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠానికి చేరుకున్నారు.

శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటున్నారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్‌ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొన్నారు.

 

Read more:

ప్రధాని మోదీతో రఘురామకృష్ణంరాజు భేటీ.. ఆ టెండర్లపై ప్రధాని ఆశ్చర్యపోయారన్న వైసీపీ ఎంపీ

Loading...
Unable to load recommendations.
Follow Us