ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ కూడా జోరు పెంచింది. తాజాగా ఆ పార్టీ నాయకుడు లంకా దినకర్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విడుదల చేశారు. లంకా దినకర్ 2019 వరకు టీడీపీలో కీలక నాయకుడిగా వ్యవహారించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూడటంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన టీడీపీ అజెండాను అనురిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో గతేడాది ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అప్పటి నుంచీ ఆయన సైలెంట్ అయ్యారు. మరో పార్టీలో కూడా చేరలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తి వేసింది. ఇకపై పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలనిర్దేశం చేసింది. పార్టీని ముందుకు తీసుకువెళ్లడానిక, నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించింది. పంచాయతీ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ బైపోల్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో లంకా దినకర్ పై సస్పెన్షన్‌ను ఎత్తేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
ఆ అడవి పందులను వధించవచ్చు.. సర్పంచులకు విచక్షణాధికారం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు