తెలంగాణలో 699 నామినేషన్లు

హైదరాబాద్: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికలకు తెలంగాణలో మొత్తం 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఒక్క నిజామాబాద్ నియోజకవర్గంలోనే 245 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. నేడు రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య 2.96 కోట్లకు చేరిందని తెలిపారు. రూ.2.45 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు రూ.2.04 కోట్ల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో […]

తెలంగాణలో 699 నామినేషన్లు

Updated on: Mar 25, 2019 | 9:31 PM

హైదరాబాద్: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికలకు తెలంగాణలో మొత్తం 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఒక్క నిజామాబాద్ నియోజకవర్గంలోనే 245 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. నేడు రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య 2.96 కోట్లకు చేరిందని తెలిపారు.

రూ.2.45 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు రూ.2.04 కోట్ల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకనుగుణంగా టీఆర్ఎస్‌కు లేఖ రాసినట్టు రజత్ తెలిపారు.

ఇక తెలంగాణ ఏమైనా పాకిస్థానా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్ల స్వీకరణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని.. అభ్యర్థుల సంఖ్య 90 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు.