భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని ప్రియాంక టిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థినిగా ప్రకటించాక ప్రియాంక కోల్‌కతాలోని కలిఘాట్ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆమె భవానీపూర్ పోరాటానికి ముందు కాళీ దేవికి ప్రార్థనలు చేశారు.

భవానీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈనెల 10న వినాయక చవితి రోజు నామినేషన్ వేశారు. ప్రముఖ న్యాయవాది ప్రియాంకా టిబ్రివాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి, మరికొందరు ముఖ్యనేతలతో కలిసి వెళ్లి ప్రియాంకా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

టీఎంసీ హింసాకాండపై న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాది అయిన ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజలకు జీవించే హక్కు ఉంది. ఈ హక్కును మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వారి నుంచి లాగేసుకుంది, అందుకే నేను బెంగాల్ ప్రజల కోసం పోరాడుతున్నాను’’ అని ప్రియాంక టీబ్రేవాల్ చెప్పారు.

భవానీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈనెల 10న వినాయక చవితి రోజు నామినేషన్ వేశారు. ప్రముఖ న్యాయవాది ప్రియాంకా టిబ్రివాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి, మరికొందరు ముఖ్యనేతలతో కలిసి వెళ్లి ప్రియాంకా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఉండాలంటే నవంబరు 5వతేదీ లోగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పోటీచేసేందుకు వీలుగా చటోపాధ్యాయ్ భవానీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉపఎన్నిక అనివార్యమైంది. భవానీపూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని ప్రకటించింది. కాగా, బీజేపీ అభ్యర్థిని ప్రియాంక టిబ్రేవాల్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగనుంది. ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడించనున్నారు.