రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం.. నలుగురు సీనియర్ పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు.. చిత్రాలు

|

Jul 31, 2021 | 10:16 PM

అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, నలుగురు సీనియర్ పోలీసు అధికారులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు.

1 / 8
అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. అసోం–మిజోరం సరిహద్దు వివాదానికి సంబంధించి చెలరేగిన హింసలో ఐదుగురు పోలీసులు చనిపోయారు. సరిహద్దు హింసకు సంబంధించి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, నలుగురు సీనియర్ పోలీసు అధికారులు, మరో ఇద్దరు పరిపాలన అధికారులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం సంచలనం రేపింది. మిజోరాం ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేస్తామని అసోం సర్కార్‌ వెల్లడించింది.

2 / 8
తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఐజీ  అనురాగ్ అగర్వాల్, డీఐజీ  కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్‌, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది.

3 / 8
బోర్డర్‌ వివాదంలో 200 మంది అసోం పోలీసులపై కూడా కేసు నమోదు చేశారు మిజోరాం పోలీసులు.

4 / 8
తనపై కేసు నమోదు చేయడంపై స్పందించారు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము భావిస్తుంటే మిజోరాం ప్రభుత్వ వైఖరి రెచ్చగొట్టే ధోరణితో ఉందన్నారు. తమ భూభాగం లోకి ప్రవేశించి తమ పోలీసులను కాల్చి చంపడమే కాకుండా .. రాష్ట్ర సీఎంపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

5 / 8
మిజోరాం సరిహద్దులోని అసోం జిల్లాలు కచర్‌, హైలకండీలో అక్టోబర్ 2020 నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా ఇళ్లు తగలబెట్టడం, భూమిని ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాలు 164.6 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి.

6 / 8
మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్‌వేనా కోసం అస్సాం పోలీసులు గాలించడం తీవ్ర కలకలం రేపింది. అసోం పోలీసులు తమ రాష్ట్రంలో మళ్లీ అడుగుపెడితే కాల్చి పారేస్తామని వన్లాల్‌వేనా పార్లమెంట్‌ ఆవరణలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ రాజ్యసభ ఎంపీపై అసోం పోలీసులు కేసు నమోదు చేయడంతో దీనికి కౌంటర్‌గా ఆ రాష్ట్ర సీఎంపై మిజోరాం పోలీసులు కేసు నమోదు చేశారు.

7 / 8
తమ రాష్ట్ర పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దంటూ అస్సాం ప్రభుత్వం గురువారం జారీ చేసిన గైడ్‌లైన్స్‌పై వివాదం చెలరేగింది.  ఈ ఉత్తర్వులను అసోం ప్రభుత్వం సమర్థించుకుంది. మిజోరం పౌరులు ఏకే-47, ఇతర అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్నారని.. అందుకే జారీ చేసినట్లు పేర్కొంది.

8 / 8
అస్సాం, మిజోరం సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 306 వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులపై ఆందోళనకారులు లేరని, దిగ్బంధనం కొనసాగడం లేదని అస్సాం అధికారులు తెలిపారు.  స్థానికులు మాత్రం రాకపోకలు ఆగిపోయాయని చెబుతున్నారు.