Yadadri Temple: యాదాద్రి వెళ్లే భక్తులకు శుభవార్త.. టెంపుల్ సిటీగా మారుతోన్న పుణ్యక్షేత్రం.. ఫోటోలు ఇవిగో..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 14, 2023 | 11:24 AM

Yadadri: తెలంగాణ ప్రజల ఇలవేల్పు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం విలాసవంతమైన విల్లాలు, కాటేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత భక్తుల తాకిడి పెరగడంతో పాటు స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో దేశానికి వన్నె తెచ్చేలా, ఆధ్యాత్మిక శోభనిచ్చేలా భక్తులకు అధునాతన సంప్రదాయ హంగులతో విలాసవంతమైన కాటేజీ, విల్లాల నిర్మాణానికి వైటిడిఏ ప్లాన్ చేస్తోంది.

1 / 7
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను యాదాద్రిగా తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 1200 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటిడిఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుమల తరహాలో ఆలయ (టెంపుల్ సిటీ) నగరి కోసం పెద్దగుట్టపై 900 ఎకరాలను సేకరించింది. దేశానికి వన్నె తెచ్చేలా ఆధ్యాత్మిక శోభనిచ్చేలా ఆలయనగరి పేరిట విల్లాలకు వైటీడీఏ రూపకల్పన చేసింది.

2 / 7
ఇప్పటికే దేశాధినేతలు, ప్రభుత్వ అధినేతల కోసం విలాసవంతమైన ప్రెసిడెన్షియల్ సూట్స్ ను నిర్మించింది. అదే తరహాలో టెంపుల్ సిటీలోని 250 ఎకరాల్లో ఆధునాతన, విలాసవంతమైన విల్లాల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించేందుకు పెద్దగుట్టపై ఆలయ నగరిలో విల్లాలు, కాటేజీలను వైటిడిఏ నిర్మిస్తోంది.

3 / 7
ఇందులో రహదారుల నిర్మాణం, ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన ప్రాంగణ రూపకల్పనలో దాదాపు 30 ఎకరాల్లో వివిధ పూలు, మొక్కలు, పచ్చదనం పోషణ చేపట్టారు.ఇంకా పెద్దగుట్టపై నిర్మిస్తున్న టెంపుల్ సిటీని వైటిడిఏ ఐదు బ్లాకులుగా విభజించింది. ఈ బ్లాకుల్లో 252 విల్లాలను నిర్మిస్తారు. ప్రతి విల్లా 900-1000 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు పడకల గదులు ఉండేలా వైటిడిఏ ప్లాన్స్ రూపొందించింది.

4 / 7
టెంపుల్ సిటీలో నిర్మిస్తున్న అధునాతన, విలాసవంతమైన విల్లాల నిర్మాణానికి దాతలు నుంచి నిధులను సేకరించాలని వైటిడిఏ నిర్ణయించింది. ఈ విల్లాలు, కాటేజీలను తిరుమల తరహాలోనే దాతలకు సదుపాయం కల్పించే నిబంధనలు అమలు చేయనున్నారు. మిగిలిన సమయాల్లో వీటిని దేవస్థానం నియంత్రణలో ఉంచుకోని భక్తులకు కేటాయిస్తారు.

5 / 7
పెద్దగుట్టలోని టెంపుల్ సిటీలో విల్లాలు, కాటేజీల నిర్మాణ రూపకల్పన బాధ్యతలు ఢిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ ఆర్కాప్‌ సంస్థ ప్లాన్స్ ను సిద్ధం చేసింది. ఈ సంస్థే హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కు డిజైన్ చేసింది. పెద్దగుట్టపై నిర్మించబోయే ఒక్కో విల్లాకు రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైటిడిఏ అంచనా వేసింది. ఇందుకు అవసరమైన నిధులను దాతల నుంచి సేకరించాలని వైటిడిఏ నిర్ణయించింది.

6 / 7
నిధుల కోసం వైటిడిఏ, దేవస్థానం అధికారులు పలువురు దాతలకు లేఖలు రాసింది. దేశంలోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులకు మరోసారి లేఖలు రాయాలని అధికారులు నిర్ణయించారు. విల్లాల నిర్మాణానికి అవసరమైన నిధులను దాతలు అందజేస్తే.. వారు సూచించిన వారి పేరిట వైటిడిఏ పనులు చేపడుతుంది. తొలిదశలో కనీసం వంద విల్లాలకు దాతలు ముందుకు రాగానే నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

7 / 7
 ఇప్పటికే టెంపుల్ సిటీలోరాష్ట్ర ప్రభుత్వం వైటిడిఏ.. 13 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని కాటేజీలను నిర్మించింది. ఈ విలాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. త్వరలోనే విల్లాల నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.