
బాలసనా అనేది యోగా భంగిమ. ఇది చాలా సులభం. ప్రతిరోజూ కేవలం 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఈ యోగాసనం చేయడం వలన చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాదు బాలాసనా సాధన చేయడం వల్ల చీలమండలను బలోపేతం చేయడం, వెన్నెముకలో వశ్యతను పెంచడం, గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచడం, జుట్టు రాలడం నుంచి ఉపశమనం పొందడం. రక్త ప్రసరణను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మార్జారాసనం ప్రతిరోజూ చేయవచ్చు. నడుము, మెడ, వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందించడంలో ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణవ్యవస్థ బలపడుతుంది.

నిరాశ నుంచి బయటపడడానికి పశ్చిమోత్తాసనాన్ని ప్రతిరోజూ కొంత సమయం పాటు చేయడం మంచిది. ఎందుకంటే ఇది ఆందోళన, ఒత్తిడిని సులభంగా తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ప్రయోజనకరమైన యోగాసనం. ప్రారంభంలో ఈ యోగాసనాన్ని చేయడంలో కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే శరీరాన్ని బలవంతంగా వంచుతూ ఈ ఆసనం వేయడం మానుకోండి.

సుప్త బద్ధ కోనాసన సాధన మనస్సుకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ యోగా ఆసనం శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. అంతేకాదు సుప్త బద్ధ కోనాసన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ యోగాసనాన్ని రాత్రి పడుకునే ముందు బెడ్‌పై వేయవచ్చు.

ప్రతిరోజూ ఉదయం కొంత సమయం పాటు సుఖాసన చేయవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ చేయగలిగే ప్రాథమిక ఆసనం. ఈ యోగా చేయడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాన్ని అభ్యసించడం ద్వారా అంతర్గత శాంతిని అనుభవిస్తారు.