Yoga Benefits: పాదాలను గోడపై ఉంచి నిద్రించి చూడండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

| Edited By: Ram Naramaneni

Feb 19, 2024 | 9:58 PM

శారీరక ఆరోగ్యం కోసం యోగ ఆసనాలు, వ్యాయామాలు చేస్తుంటారు. మానసిక ఆరోగ్యం కోసం కూడా యోగా సరైన ఎంపిక. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  అయితే కండరాల నొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ఉపశనం కోసం ఈ యోగా పోజుని ట్రై చేసి చూడండి. 

1 / 6
మీ పాదాలను గోడపై ఉంచి నిద్రించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని చేయాలి. కండరాల నొప్పి నుండి అధిక రక్తపోటు వరకు అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

2 / 6
పాదాలను గోడకు ఆనించి నిద్రించడం అనేది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే ఒక రకమైన వ్యాయామం. ఈ సాధారణ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆసనాన్ని ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు చేయాలి.  

3 / 6
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా మలబద్ధకం, కడుపు నొప్పి, అపానవాయువు వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి ప్రతి రోజూ కనీసం 20 నిమిషాల పాటు మీ పాదాలను గోడకు ఆనుకుని నిద్రించండి. 

4 / 6
నిద్రలేమి సమస్య: ఈ ఆసనాన్ని ఇన్‌వర్టెడ్ స్లీపింగ్ పొజిషన్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని వలన ఆందోళన మరియు నిద్రలేమి సమస్యల నుండి బయటపడవచ్చు.

5 / 6
కండరాల నొప్పి నుండి ఉపశమనం: మీ పాదాలను గోడకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటే కండరాలు విశ్రాంతి పొందుతాయి. అంతేకాదు పాదాలు, అరికాళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది.

6 / 6
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: పాదాలను గోడకు ఆనుకుని నిద్రించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు కాళ్ళలో వాపు , జలదరింపును కూడా తగ్గిస్తుంది. కొందరిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో వాపు సమస్య కనిపిస్తుంది.