నేటి జీవన శైలి, ఆహారపుటలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఆడమగ తేడా లేకుండా.. అందరికీ జుట్టు రాలిపోతుంది. అయితే, జుట్టు రాలడాన్ని తగ్గించే విత్తనం ఒకటి ఉంది.. అదే చిరోంజి.
చిరోంజిలో ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మంచి కొవ్వు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, విరిగిపోకుండా నిరోధించడానికి మేలు చేస్తుంది.
చిరోంజి గింజలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చిరోంజిలో ఉండే లక్షణాలు జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చిరోంజి గింజలు తినడంతో పాటు, దాని నూనెను రాసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు కూడా మంచిది.
జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది. 2 స్పూన్ చిరోంజి గింజలను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తినాలి. ఇలా 4 వారాల పాటు తింటూ ఉంటే జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
చిరోంజిలో ఉండే లక్షణాలు జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చిరోంజి గింజలు తినడంతో పాటు, దాని నూనెను రాసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు కూడా మంచిదని భావిస్తారు. జుట్టుతో పాటు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. చిరోంజీ మన రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరానికి బలాన్ని ఇస్తుంది.