
ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే.. చాలా మంది కోతుల కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకువచ్చారు. ఇష్టమైన పండ్లను ఆరిగిస్తూ కోతులు తెగ ఎంజాయ్ చేస్తున్నాయి.

థాయ్‌లాండ్‌లో ఈ మంకీ ఫెస్టివల్ నిర్వహిస్తారు. కరోనా మహమ్మారితో రెండేళ్లపాటు ఈ ఫెస్టివల్ నిలిచిపోయింది. తాజాగా ఈ పండుగను అట్టహాసంగా ప్రారంభించారు.

దీంతో థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతం వేలాది మంది టూరిస్టులు, వానరాలతో కిక్కిరిసి పోయింది. మంకీ ఫెస్టివల్ కోసం వేలాది పండ్లను, పలు ఆహార పదార్థాలను అక్కడ సమకూర్చారు.

ఈ ఫెస్టివల్‌లో పర్యాటకులు, స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంకీ ఫెస్టివల్ కోసం రెండు టన్నుల పండ్లు, కూరగాయలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఫెస్టివల్‌లో కోతులు పలువురు వ్యక్తులపై కూర్చొని హాయిగా పండ్లను తింటున్నాయి. అందుకే లోప్‌బురిని “మంకీ ప్రావిన్స్” అని పిలుస్తారు.

కాగా.. రెండు కరోనా టీకాలు తీసుకున్న పర్యాటకులను అనుమతిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది.

దీంతో కరోనా సర్టిఫికెట్‌తో పనిలేకపోవడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఈ క్రమంలోనే కోతుల పండుగను నిర్వహించడంతో పర్యాటకులు లోప్‌బురి ప్రాంతానికి క్యూ కడుతున్నారు.

థాయిలాండ్‌లోని లోప్‌బురి అనే ప్రాంతంలోనే ఈ మంకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ప్రతి ఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు.

దాదాపు రెండేళ్ల తర్వాత కోతులు ఇష్టంగా ఆహారాన్ని తింటున్నాయంటూ నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం ఈ మంకీ ఫెస్టివల్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

గ్రాండ్‌గా కోతుల పండగ.. సంబురంగా జరుపుకుంటున్న ప్రజలు..