బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంధురాలు. చెర్నోబిల్ విపత్తు, సోవియట్ యూనియన్ రద్దు , బ్రిటీష్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో ఒకటైన ప్రిన్సెస్ డయానా మరణంతో సహా ఆమె అనేక అంచనాలు నిజమయ్యాయి.
బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 2023కి గాను 5 మేజర్ అంచనాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాబా వంగా అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలోని కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని అంచనా వేశారు.
2020 సంవత్సరం వినాశకరమైనదని భావిస్తే.. బాబా వంగా 2023లో జరగనున్న అంచనాలను తెలిస్తే.. మరింత షాక్ కి గురి అవుతారు. కొత్త ఏడాదిలో భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని.. మానవ ఉనికి చరిత్రలో అతిపెద్ద ఖగోళ సంఘటన జరగనుంది. దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని చెప్పారు. సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని చెప్పారు.
భూమి మీద గ్రహాంతరవాసుల రాక 2023 లో జరుగుతుందని... వీరి రాక మిలియన్ల మంది మరణానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేస్తుంది. అపారమైన విధ్వంసం కలిగించనున్నదని పేర్కొన్నారు.
బాగా వంగ అంచనాల ప్రకారం, ఉక్రెయిన్ , రష్యా మధ్య విభేదాల కారణంగా 2023 ప్రపంచ సంక్షోభం ఎదుర్కోనుంది. 2028లో ఒక వ్యోమగామి శుక్రుడిపైకి దిగుతాడని చెప్పారు. అయితే 5079 ప్రపంచ ముగింపుని సూచిస్తున్న సంవత్సరం అని పేర్కొన్నారు. అంతేకాదు బాబా వంగ తన మరణానికి ముందు కొన్ని సంవత్సరాల గురించి కూడా అంచనా వేశారు.
1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. ఆమె చిన్నతనంలో ఆమె కంటి చూపును కోల్పోయింది. ఆమె పారానార్మల్ సామర్ధ్యాలను కలిగి ఉందని నమ్ముతారు. బాబా వంగ భవిష్యత్ కోసం చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి.