
ఏథర్ 450 ఎస్ ఈవీ స్కూటర్ రూ. 1,25,000 ధరలో అందుబాటులో ఉంటుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 5.4 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినిస్తుంది. 115 కి.మీ పరిధితో వచ్చే ఈ స్కూటర్‌లో ఏడు 7 అంగుళాల డీప్ వ్యూ డిస్‌ప్లే, డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ వెర్షన్ డీఎన్ఏకు కట్టుబడి ఉంటుంది. మూడేళ్లు లేదా 30,000 కి.మీ వారెంటీ ఈ ఈవీ స్కూటర్ ప్రత్యేకత.

ఓపీజీ మొబిలిటీ ఫెర్రాటో రిలీజ్ చేసిన ఫాస్ట్ ఎఫ్-4 ఈవీ స్కూటర్ రూ. 1,09,000కు అందుబాటులో ఉంటుంది. 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 2.5 కేడబ్ల్యూ మోటారుతో వచ్చే ఈ స్కూటర్ ఛార్జ్‌కు 160 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీగా ఉంటుంది. డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌తో వచ్చే ఈ స్కూటర్ మూడు 3 సంవత్సరాల లేదా 30,000 కి.మీ వారెంటీతో వస్తుంది.

ఓలా ఎస్1 ప్రో ఈవీ స్కూటర్ రూ. 1,35,000కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌పై 120 కిమీ గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. 195 కిమీ పరిధితో ఈ స్కూటర్ 6 కేడబ్ల్యూ మోటార్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే వాయిస్ కమాండ్‌లు, యూజర్ ప్రొఫైల్‌లు, ఓటీఏ అప్‌డేట్‌లు వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లతో వచ్చే 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను ఈ స్కూటర్ ప్రత్యేకత. మూడేళ్ల వారెంటీ లేదా 40,000 కిమీ వరకు వారెంటీ లభిస్తుంది.

ప్యూర్ ఈవీ ఎప్లుటో 7 జీ మ్యాక్స్ స్కూటర్‌ను రూ. 1,15,000కు కొనుగోలు చేయవచ్చు. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 2.2 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినిస్తుంది. అలాగే 201 కి.మీ రేంజ్‌తో వచ్చే ఈ స్కూటర్‌పై గంటకు 63 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు. ఈ స్కూటర్ పట్టణ ప్రయాణికులకు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

విడా వీ2 ప్రో స్కూటర్‌ను రూ. 1,20,300కు కొనుగోలు చేయవచ్చు. 3.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 6 కేడబ్ల్యూ మోటారుకు శక్తినిస్తుంది. ఈ స్కూటర్ 165 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌పై గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.