
Rice

బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా అన్నంలో పెరిగి, విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. మళ్లీ వేడి చేసినప్పుడు బ్యాక్టీరియా చనిపోయినా.. ఆ విష పదార్థాలు అన్నంలో అలాగే ఉండిపోతాయి. దీనిని నివారించడానికి, వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకుండా, వీలైనంత త్వరగా తినడం మంచిది.

ఆహారం విషం: మళ్లీ వేడిచేసిన అన్నాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్టీరియా విడుదల చేసిన విష పదార్థాలు శరీరంలోకి చేరి వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి.

కడుపు సమస్యలు: బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషాలు కడుపులో సమస్యలను కలిగిస్తాయి. పరిశోధనల ప్రకారం, అన్నాన్ని సరిగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది, ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

జీర్ణక్రియ దెబ్బతినడం: అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు కోల్పోతాయి. ఇది జీర్ణం కాకుండా ఉండి, కడుపు నొప్పికి కారణమవుతుంది. తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇలాంటి ఆహారాన్ని తినకుండా ఉండటం ఉత్తమం. ఇది మలబద్ధకం వంటి ఇతర కడుపు సమస్యలను కూడా పెంచుతుంది. కాబట్టి వండిన వెంటనే అన్నం తినడానికి ప్రయత్నించండి.