
నాటు కోడికి నార్మల్ చికెన్ ను చాలా తేడా ఉంటుంది అది మెత్తగా ఉంటుంది కానీ, నాటు కోడి మాంసం గట్టిగా ఉంటుంది అసలు త్వరగా ఉడకదు. చాలా మంది దీనిని ముందే వేడి నీళ్ళలో ఉడకబెట్టి చేసుకుంటారు. నాటు కోడిని కోసేటప్పుడు చాలామంది పసుపు రాస్తారు? ఇలా ఎందుకు రాస్తారో ఎవరికీ తెలియదు .

ఇలా పసుపు రాయడం ఇది ఆచారమా లేక దీని వెనుక మనకి తెలియని సైన్స్ ఉందా? అయితే, ఇలా రాయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఈ కోళ్లు ఇళ్ల వద్ద పెరుగుతాయి. కాబట్టి, కట్ చేసేటప్పుడు పసుపు రాస్తారు ఇంకో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ మాంసంపై ఉండే చెడు క్రిములు నశించడానికి ఇది రాస్తారు.

నాన్ వెజ్ లో ఏ రకం మాంసం అయినా వాసన వస్తుంది దీనిని తగ్గించడానికి దీనిని రాస్తారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా మాంస వాసనను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ సారి మీరు నాటు కోడిని కట్ చేసేటప్పుడు ఇలా పసుపు రాసి చిన్న చిన్న ముక్కలుగా చేసి కూర వండుకోండి టేస్ట్ కూడా పెరుగుతుంది.

ఇంకా మంచి కలర్ రావడంతో పాటు కూర కూడా టేస్టీ టేస్టీగా ఉంటుంది. అయితే, గ్రామాల్లో ఇప్పటికి ఇదొక ఆచారంలా కొనసాగుతోంది. అలాగే, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మాంసం కూడా ఫ్రెష్ గా ఉండేందుకు దీనిని వాడొచ్చు. అలాగే, కొంతసేపు మాంసం చెడిపోకుండా ఇది సహాయపడుతుందని పెద్దలు అంటున్నారు.

ఇంకా ఈ పసుపులో ఉండే కర్కుమిన్ మానవ శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)